విద్యార్థిని బండారు లక్ష్మీ శరణ్యకు పద్మశాలి సంఘం ఆర్థిక సాయం
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,కామవరపు కోట మండలం ముండూరులోపేద విద్యార్థిని బండారు లక్ష్మీ శరణ్య ఉన్నత చదువులకు ఏలూరు జిల్లా పద్మశాలి సంఘం రూ. 50.00 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది.పోలవరం గ్రామానికి చెందిన లక్ష్మీ శరణ్య పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరచడంతో పాటు ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో 24,596వ ర్యాంకు సాధించింది. ఎంబీబీఎస్ చదివి వైద్యురాలిగా ఎదగాలన్నది తన లక్ష్యమని ఆమె తెలిపింది.లక్ష్మీ శరణ్య తండ్రి శ్రీనివాసరావు టైలరింగ్ వృత్తి చేస్తుండగా, తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్య ఖర్చులతో పాటు చదువు ఖర్చులు భరించడం కుటుంబానికి భారంగా మారింది. ఈ నేపథ్యంలో పద్మశాలి సంఘాన్ని ఆశ్రయించగా జిల్లా కమిటీ స్పందించి రూ.50 వేల సాయం అందించింది.ఈ సందర్భంగా లక్ష్మీ శరణ్య సంఘం నాయకులకు, ముండూరు గ్రామ పద్మశాలి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపోలు భావనాఋషి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు తాడేపల్లి ఉమ, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరాపు పెద్దరాజు, మర్రి సుధాకర్ మాస్టర్, గొరిగే తిరుమలరావు, ఆకురాతి వీరభద్రరావు, జిల్లా నరసింహరావు, బూదాటి హర్షవర్ధన్, కూసం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం