BREAKING
నీటిని పొదుపుగా వాడుకోవాలి* *మున్సిపల్ కమిషనర్ నాగరాజు* అమృతమ్మ హత్య కేసులో మరో కీలక పరిణామం ఇండస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గా ‘ఇండస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్’ గడప గడపకు సంక్షేమ పథకాలు: రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపిలో చేరికలు.. దసరా పండుగకు ప్రత్యేక బస్సులు సూర్యాపేట డిపో మేనేజర్ సునీత పీఆర్సీ కమిషన్ నివేదిక కాల పరిమితి తగ్గించాలి: ఏపీటీఎఫ్ రాష్ట్ర కబడ్డీలో యాదాద్రి జట్ల జోరు ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకుంటాం ఘనంగా 'నల్లమల సానువుల్లో గాంధీ గారి ప్రస్థానం' పుస్తకావిష్కరణ ఎల్‌ నినో ఎఫెక్ట్: భాగ్యనగరంలో మొదలైన నీటి కష్టాలు చందన షాపింగ్ మాల్‌ ఎదుట సిబ్బంది ధర్నా మేనేజర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించి నిరసన విద్యార్థులకు సైబర్ నేరాలు, బాలికల భద్రతపై అవగాహన సంపద సృష్టిలో భాగ్యనగరం జోరు: తెలంగాణ టాప్-10 ధనవంతులు వీరే! 9వ వార్డులో ఘనంగా అన్న సమారాధన

కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత

Select Suryaa Now
కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత

 

కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏలూరు నుంచి గుంటూరు వైపు వెళ్లే మార్గంలో ఉన్న 6 టోల్ గేట్లకు అడ్డంగా 20 టిప్పర్ లారీలను నిలిపివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. టోల్ రుసుము చెల్లించిన తర్వాతే లారీలను ముందుకు వెళ్లనిస్తామని టోల్ ప్లాజా సిబ్బంది స్పష్టం చేయగా, తాము ప్రభుత్వ ప్రాజెక్టు పనుల నిమిత్తం మట్టిని తరలిస్తున్నందున టోల్ మినహాయింపు ఉంటుందని లారీ డ్రైవర్లు వాదనకు దిగారు. ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి డ్రైవర్లు టోల్ రుసుము చెల్లించి వెళ్లాలని, ఆ తర్వాత సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవాలని పోలీసు అధికారులు లారీ డ్రైవర్లకు సూచించి పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.