BREAKING
తోటపల్లి అంగన్వాడీ వర్కర్ సుజాతకు ఘన సత్కారం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి పాలకొండ శ్రీ పురటాల పాలమాంబ ఆలయంలో చోరీ రెడ్ క్రాస్ ములుగు జిల్లా కమిటీ సభ్యుడిగా వద్ది శ్రీనాథ్ రేపు"తోటపల్లి"లో వరుణ యాగం,వరుణ జపం ఉపాధి, విద్య రెండూ అవసరమే : DD AE అనిత గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సందడే సందడిగా అంగన్వాడీ ఉత్సవం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల యూరియా సీజ్ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక గౌరవం జయప్రకాష్ కు గౌరవ డాక్టరేట్ వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కర్లెమ్మ ఆర్ అండ్ ఆర్ కాలనీలో నీటికోసం గగ్గోలు గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఎన్నికల కమిషన్ విధానాలు

Select Suryaa Now
ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఎన్నికల కమిషన్ విధానాలు

 

ఓటర్ల హక్కులకు భంగం కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ విధానాలు ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ లోని బెల్వర్డి గార్డెన్ అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరు నమోదు ఎందుకని ప్రశ్నించారు. నూతన గ్రాడ్యుయేట్ లను మాత్రమే ఓటరు గా నమోదు చేసుకునే విధానాన్ని అమలు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా, ఆ విధంగా జరగడం లేదని అన్నారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో కూడా టెక్నాలజీ, కార్యక్రమంపై ఎలాంటి అవగాహన లేని వారిని BLO లు గా నియమించడం వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. దీని వలన లక్షలాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించబడ్డాయని తెలిపారు. తిరిగి పేర్లు తొలగించబడ్డ ఓటర్లకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై లేదా అని ప్రశ్నించారు. పెద్ద వ్యవస్థ కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని ఎన్నికల కమిషన్ ఎందుకు తీసుకోవడం లేదన్నారు. త్వరలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్ లు ఓటరు గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీ ప్రాంతంలో, మీకు పరిచయమున్న గ్రాడ్యుయేట్ లు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. ఓటు ఎవరికి వేయాలి అనేది అది మీ నిర్ణయంపై ఆధారపడి ఉందని, కానీ ముందు ఓటరుగా నమోదు కావాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా విద్యుత్, త్రాగునీటి సమస్య నెలకొందని అన్నారు. మున్సిపల్, హోం, విద్యాశాఖ మూడు కూడా ముఖ్యమంత్రి తన వద్దే పెట్టుకొని వాటిపై ఇప్పటి వరకు పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి మాట్లాడే భాష అందుకు భిన్నంగా ఉందని, ప్రజలు అందరు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో త్రాగునీరు, విద్యుత్ వంటి సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ చేసి అవసరమైన చర్యలు తీసుకునే వారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ లు తమ వివరాలు నమోదు చేసిన ఓటరు నమోదు పత్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. కార్యక్రమంలో పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, అపార్ట్మెంట్ వాసులు జగ్గయ్య, రాజశేఖర్, ముకుంద్, సత్యనారాయణ, ఆనంద్, ప్రసాద్, పవన్, బాల్ రెడ్డి, డాక్టర్ ఇందిర, బిఆర్ఎస్ పార్టీ బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, వెంకటరమణ, శ్రీకాంత్ రెడ్డి, మిట్టపల్లి బాబూరావు, కొత్తూరు వెంకట్, MN శ్రీనివాస్, కృష్ణ ముదిరాజ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.