తోటపల్లి అంగన్వాడీ వర్కర్ సుజాతకు ఘన సత్కారం
- ఘనంగా సత్కరించిన చిన్నారుల తల్లిదండ్రులు
- పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర కీలకం
గరుగుబిల్లి: గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పోషణ మా’ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన అంగన్వాడీ వర్కర్ కందుకూరి సుజాత ను చిన్నారుల తల్లిదండ్రులతో పాటు పలువురు అభివృద్ధి దాతలు ఘనంగా సత్కరించారు.ఈసందర్భంగా అంగ న్వాడీ వర్కర్ కందుకూరి సుజాతకు మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధు లు, అధికారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.అదే విధంగా సేవా స్ఫూర్తితో పనిచేస్తున్న అంగన్వా డీ కార్యకర్తను అభినందించారు.అంగ న్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు,ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికా హారం అందించడంలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పలువురు పేర్కొన్నారు. పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. ఈకార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రు లు తదితరులు పాల్గొన్నారు.