న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ది అడ్వకేట్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా సోమవారం న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.తెలంగాణలో అమలవుతున్న తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ న్యాయవాదులందరికీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు విత్తనాల రాజు, జనరల్ సెక్రటరీ మానికెళ్ల సూరిబాబు, జాయింట్ సెక్రటరీ వింజమూరి కిరణ్‌కిషోర్, ట్రెజరర్ బల్లే సాయికుమారి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు మేక ఈశ్వరయ్య, పొన్న లక్ష్మణరావు, ఎన్‌వీబీఎల్ ఆచారి, పీవీ కృష్ణారెడ్డి, అచ్యుత శ్రీనివాస్, కంకిపాటి రాంబాబు, రాయి వసంతరావు, శొబ్బన ఆనందరావు, పాశం ప్రతాప్, మోడేపల్లి నాగులు తదితరులు పాల్గొన్నారు.
కెవి రమణారావు జంగారెడ్డిగూడెం