మోమిన్‌పేటలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ప్రారంభం
24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో
మోమిన్‌పేట, మేజర్ న్యూస్( అక్టోబర్ 4):
మోమిన్‌పేట మండల కేంద్రంలోని న్యూ బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్‌గౌడ్, రావులపల్లి సర్పంచ్ యాదవ్‌రెడ్డి, డాక్టర్ జిమ్మే ముఖ్య అతిథులుగా హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్‌మెంట్ మహమ్మద్ హర్షద్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో 24 గంటల అత్యవసర వైద్య సేవలు, జనరల్ మెడిసిన్, డయాగ్నస్టిక్ సేవలు, ఫార్మసీ, ల్యాబొరేటరీ తదితర సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.మోమిన్‌పేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్‌ను పలువురు అభినందించారు.అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో వైద్యులు, నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్లు గంగాధర్, రఫీయుద్దీన్, శ్రావణ్, నాయకులు మల్లయ్య, ఏ.రాజ్‌పాషా, పడియాల బాబు, బాబుమియా, ప్రవీణ్, నర్సింలు, మానయ్యతో పాటు స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ వడ్ల మాణిక్యం చారి.