BREAKING
మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కె. సుజాత భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీకి ఘన సత్కారం ఏపీలో గృహ నిర్మాణానికి కొత్త శకం.. వైద్య ఆరోగ్యశాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్. మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌ 2.0 విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి కేబీఆర్ పార్క్ చుట్టూ రింగ్ రోడ్డు ఎందుకు? కళ్యాణ మండపం నిర్మాణం, భూ సమస్య పరిష్కారం కోసం వినతి "చదవడం మా కిష్టం" కార్యక్రమంకు విశేష స్పందన నీటిని పొదుపుగా వాడుకోవాలి* *మున్సిపల్ కమిషనర్ నాగరాజు* అమృతమ్మ హత్య కేసులో మరో కీలక పరిణామం ఇండస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గా ‘ఇండస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్’

ఈ నెల 5 నుండి  13 రోజుల పాటు సదరం క్యాంపులు

Select Suryaa Now
ఈ నెల 5 నుండి  13 రోజుల పాటు సదరం క్యాంపులు

సూర్య , మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులకు ఈ నెలలో యుడిఐడి/సదరం వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డిఆర్డిఓ) కిషన్  ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మంచిర్యాలలో ఈ శిబిరాలు జరుగుతాయని పేర్కొన్నారు. దివ్యాంగత్వ రకాన్ని బట్టి తేదీల వారీగా శిబిరాల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 5, 8 తేదీల్లో వినికిడి లోపం, మాట్లాడటం, భాష లోపం ఉన్నవారికి అక్టోబర్ 6, 7 తేదీల్లో మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం ఉన్నవారికి అక్టోబర్ 9, 12, 13, 14, 15, 24, 26 తేదీల్లో లోకోమోటర్, ఆర్థో వైకల్యం ఉన్నవారికి, అక్టోబర్ 27న కొడవలి కణం, సికిల్ సెల్ వ్యాధి, హిమోఫీలియా బాధితులకు, అక్టోబర్ 28న తక్కువ దృష్టి , దృష్టి లోపం, తలసేమియా బాధితులకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో యుడిఐడి/సదరం పోర్టల్ లో కొత్తగా నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత పత్రాలతో నిర్ణీత తేదీలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి హాజరు కావాలని, ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ కోరారు.