BREAKING
భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీకి ఘన సత్కారం ఏపీలో గృహ నిర్మాణానికి కొత్త శకం.. వైద్య ఆరోగ్యశాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్. మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌ 2.0 విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి కేబీఆర్ పార్క్ చుట్టూ రింగ్ రోడ్డు ఎందుకు? కళ్యాణ మండపం నిర్మాణం, భూ సమస్య పరిష్కారం కోసం వినతి "చదవడం మా కిష్టం" కార్యక్రమంకు విశేష స్పందన నీటిని పొదుపుగా వాడుకోవాలి* *మున్సిపల్ కమిషనర్ నాగరాజు* అమృతమ్మ హత్య కేసులో మరో కీలక పరిణామం ఇండస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గా ‘ఇండస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్’ గడప గడపకు సంక్షేమ పథకాలు: రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

ఆరోగ్యకర సమాజమే లక్ష్యం

Select Suryaa Now
ఆరోగ్యకర సమాజమే లక్ష్యం

పామూరు, మేజర్ న్యూస్ : 

పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం అని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎంవీఎస్‌ పార్వతి అన్నారు. మండలంలోని నిమ్మచెట్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా మన అంగన్వాడీ-మన బాధ్యత స్ఫూర్తితో అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 7 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పార్వతి తెలిపారు. స్థానికంగా లభించే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. మాతృ సంరక్షణ, వ్యాక్సినేషన్‌, ఈసీసీఈ విద్య, పీఎంఎంవై, మిషన్‌ వాత్సల్య పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఈశ్వరమ్మ, కళ్యాణి, రామాంజమ్మ, హెల్పర్లు త్రివేణి, లక్ష్మీకుమారి, సుశీలతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు పాల్గొన్నారు.