ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ పిలుపు
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని మహాసభలకు మేధావులు గిరిజన సంఘాల నాయకులు భారీగా హాజరై సభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ పిలుపునిచ్చారు.. తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు రంగారెడ్డి జిల్లాలోని కర్మన్ ఘాట్ నందనవనంలో కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన సమావేశానికి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏం బాలు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .హైదరాబాదులోని రవీందర్ నాయక్ నగర్, పలక్ నామాలో రష్ట్ర సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుపై నంగారా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. అంతరించిపోతున్న గిరిజనుల సంస్కృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది గిరిజన కళాకారులు, ఉద్యమ నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ పులిన్ బస్కీ, ఉత్సవాల ఆహ్వాన సంఘం గౌరవ చైర్మన్ డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డా. రామచంద్రనాయక్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, గిరిజన ఎంపీలు,ఎమ్మెల్యేలతో పాటు గిరిజన సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. రెండు రోజులపాటు హైదరాబాదులో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటు న్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామన్నారు. కేంద్రంలో బిజెపి గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గిరిజన సంస్కృతి ఆచారాలపై ఆధిపత్య మనువాద భావజాలంతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా బిజెపి ఆర్ఎస్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని, మైదాన ప్రాంతంలో 5 ఐటిడిఏలను ఏర్పాటు, ప్రతి గిరిజన తండా,గూడెం గ్రామపంచాయతీలకు ప్రతి ఏటా 25 లక్షలు, పోడు భూములకు హక్కు పత్రాలు, మూడు గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ప్రతి ఏటా 1500 కోట్లు ఇస్తామంటూ అనేక హామీలను ఇచ్చిందన్నారు. వాటిని ఇంతవరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీల అమలు కోసం భవిష్యత్తులో కలిసి వచ్చే గిరిజన సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామన్నారు.
తెలంగాణ గిరిజన సంఘం నూతన కమిటీ ఎన్నిక…
తెలంగాణ గిరిజన సంఘం కమిటీన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంఘం కన్వీనర్ గా ఈశ్వర్ నాయక్ కో కన్వీనర్లుగా గోపీనాయక్ ఆర్ పాండు నాయక్ సభావట్ వెంకటేష్ నాయక్,సువాలి బాయి, లక్ష్మణ్ నాయక్,భాస్కర్ నాయక్, కమిటీ సభ్యులుగా నేనావత్ పాండు, ఎస్ రవి, ఆర్ అంజి, ఆర్ లక్ష్మణ్,కే సుమన్,ఆర్ శీను, హరీష్ నాయక్, తదితరులను తీసుకున్నారు అనుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నుండి అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు..
-M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్….