నాలుగు కోట్లతో తార్ రోడ్డు పనులకు శంకుస్థాపన
కందుకూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ రోడ్లకు పల్లె పండుగ 1,2, పీఎంజిఎస్ వై, నాబార్డ్, ఆర్ అండ్ బి తదితర నిధులతో ఈ రెండున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో 42.64 కోట్లతో 17 తారురోడ్లను నిర్మించాం అని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.
పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 6 గ్రామాలకు కొత్తగా తారురోడ్లు నిర్మించేందుకు 9.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
అందులో భాగంగా ఆదివారం లింగసముద్రం మండలంలో RR పాలెంలో PMGSY కింద 1.15 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు, 1.97 కోట్లతో నిర్మించనున్న విశ్వనాధపురం - గంగపాలెం తారురోడ్డు, 90 లక్షలతో నిర్మించనున్న మేదరమిట్లపాలెం - జంగాలపల్లి తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఆదివారం శంకుస్థాపన చేశారు.