ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రుగ్వేద పాఠశాల ప్రిన్సిపాల్ ,విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా అవార్డు
మండల పరిధిలోని రుగ్వేద పాఠశాల ప్రిన్సిపాల్ రజిని ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కినట్లు తెలిపారు.
విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవార్డు అందుకోవడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఎర్ర లింగం సూర్య మేజర్ న్యూస్, మంచాల