డిఎ కు క్యాబినెట్ ఆమోదం పట్ల తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ హర్షం
డీఏకు కేబినెట్ ఆమోదం పట్ల తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ హర్షం
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):
డీఏకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశారు .డీఏను త్వరితగతిన ఉద్యోగులకు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.టి.ఎస్ మెసా ఖమ్మం జిల్లా జనరల్ బాడీ సమావేశం అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు ఈ సమావేశంలో మైనారిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంఘం బలోపేతం, మెంబర్‌షిప్ డ్రైవ్ , భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
అదేవిధంగా, జేఏసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్ అమలు, పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ బిల్లులు మరియు డీఏ ఏరియర్స్‌ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది.ప్రతి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న మైనారిటీ ఉద్యోగులను గుర్తించి సంఘంలో సభ్యులుగా చేర్చుకునేందుకు మెంబర్‌షిప్ డ్రైవ్‌ను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఖమ్మం జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన కార్యవర్గ సభ్యుల స్థానాల్లో కొత్త సభ్యులకు అవకాశం కల్పిస్తూ, ఖాళీ అయిన కార్యవర్గ స్థానాలను భర్తీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం.డి. అస్లాం ఖాన్, జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ ఎ. జిలానీ మాట్లాడుతూ, మైనారిటీ ఉద్యోగులకు ఏ సమస్య ఎదురైనా టి.ఎస్ మెసా ముందుండి పరిష్కారం కోసం పోరాడుతుందని, ప్రతి మైనారిటీ ఉద్యోగి సంఘంతో కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
---సేవలను గుర్తిస్తూ సర్టిఫికెట్ల ప్రదానం
టి.ఎస్ మెసా లో సేవలందిస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో, రాష్ట్ర అధ్యక్షులు అందించిన ప్రశంసా/గుర్తింపు సర్టిఫికెట్లను గౌరవ అధ్యక్షులు ఎం.డి. సలీం చేతుల మీదుగా ఉద్యోగులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందుకున్న ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర సెక్రటరీ షేక్ హుస్సేన్ పాషా, ట్రెజరర్ ఎస్.కే. యాకూబ్ పాషా, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం.డి. అబ్దుల్ సత్తార్, అడిషనల్ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్ సమద్, వైస్ ప్రెసిడెంట్లు ఎం.ఏ. గాఫర్, సయ్యద్ సోహైల్, షేక్ హసీనా బేగం, జాయింట్ సెక్రటరీలు షేక్ జానీ మియా, షేక్ సుభాని, షేక్ అఫ్జల్ పాషా, అజ్మత్ మిర్జా బైగ్, ప్రెస్ & పబ్లిసిటీ సెక్రటరీ షేక్ సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.డి. ఫాతిమా ఫర్హీన్, ఈసీ సభ్యులు అజీజ్ షరీఫ్, షేక్ వహీదున్నిసా, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ హసన్ పాషా, మజర్ సాహెబ్, మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.