ఆదిపరాశక్తి శ్రీ కాళికాదేవి, జగద్గురు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వార్ల దేవస్థానం. దర్శించుకున్న పద్మశ్రీ డా॥వేలు ఆనందాచారి స్థపతి..
చింతపల్లి మేజర్ న్యూస్ .నల్గొండ జిల్లా.
కేంద్ర ప్రభుత్వంచే "పద్మశ్రీ" అవార్డు అందుకున్న విశ్వకర్మ ముద్దుబిడ్డ పద్మశ్రీ "శ్రీ వేలు ఆనందాచారి"(స్థపతి) అమ్మలను కన్న అమ్మ.మూలపుటమ్మ
కొలిస్తే కొంగు బంగారం!
అమ్మ అని స్మరిస్తే…ఆయు ఆరోగ్యాలు.
ఆరాధిస్తే అష్టఐశ్వార్యాలు
కలగంటే కంటి రెప్పలా కాపాడే అమ్మ ఎన్నో మహిమలు చూపిస్తున్న జగజ్జనని శ్రీ శ్రీ శ్రీ కాళికాదేవి మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయము పునః నిర్మాణంకు సంబందించి కొన్ని సూచనలు చేయడానికి దేవస్థాన చైర్మన్ డా"శ్రీ ముంజంపల్లి .విద్యాధరా చారి కురుమపల్లి దేవాలయానికి ఆహ్వానించడం జరిగింది. *ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటి సభ్యులు ,గ్రామ కులస్తులు, గ్రామ సర్పంచ్ కట్ట .మహేష్ , హస్తినాపురం బిఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఆందోజు. సత్యనారాయణ చారి , మీర్ పేట శ్రీ ఈశ్వరీ మాత సంఘం కమిటి సభ్యులు , విరాట్ నగర్ గ్రామస్తులు , గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*..