BREAKING
ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి వైసిపి నాయకులు విమర్శలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం ఎద్దులను ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత ఆదిపరాశక్తి శ్రీ కాళికాదేవి, జగద్గురు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వార్ల దేవస్థానం. దర్శించుకున్న పద్మశ్రీ డా॥వేలు ఆనందాచారి స్థపతి.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రుగ్వేద పాఠశాల ప్రిన్సిపాల్ ,విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా అవార్డు అప్పుల ఊబిలో తెలంగాణ స్వచ్ఛ అంగన్వాడి గా పద్మ కలెక్టర్ నుండి అవార్డు విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి

దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత

Select Suryaa Now
దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత

దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత.

    *మానవత్వపు అభయహస్తం -- దివ్యాంగ సమాజాన్ని ఆదుకునే నేస్తం.

సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్  తమ్మిశెట్టి శ్రీనివాసులు

పులివెందుల మేజర్ న్యూస్:

    *సమాజంలో సంపూర్ణ వెనుకబడినవర్గమైన, అవయవాలులేని దివ్యాంగులకు ప్రతిఒక్కరూ సహకరించాలని, అన్నిరకాల వివక్షతలకు గురైన వికలాంగులకు న్యాయస్థానాలు సదా బాసటగా నిలుస్తాయని, దివ్యాంగుల హక్కుల చట్టం- 2016 ప్రకారం అన్ని రంగాలలో వారికి సంపూర్ణ భాగస్వామ్యం, సమాన హక్కులు ఉన్నాయని, వారికి  న్యాయస్థానాల తరఫున ఉచిత న్యాయసహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, పరోపకారిగా పేరుగాంచిన స్వర్గీయ  ఎస్వి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా దివ్యాంగులకు, అనాధలకు సేవాకార్యక్రమాలు విరివిగా చేపడుతూ, అభాగ్యులకు  ఎలప్పుడూ అండగా ఉండే  సీనియర్ న్యాయవాది సింగం కరుణాకర్ రెడ్డి సేవలు అమూల్యమైనవని, ఆయన నేటితరం న్యాయవాదులకు దశా దిశా నిర్దేశకుడు, మార్గదర్శకుడని జమ్మలమడుగు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తమ్మిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు.*
      *ప్రముఖ వ్యాపారవేత్త,  ఫైనాన్షియర్,  సింగం వెంకటనారాయణరెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని, వికలాంగుల కమ్యూనిటీభవనంలో ఏర్పాటు చేసిన ఒక సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తమ్మిశెట్టి శ్రీనివాసులు, ప్రముఖ సంఘసేవకులు నక్కలపల్లె కొండారెడ్డి, తదితరులు దివంగత నారాయణరెడ్డి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.  ఈసందర్భంగా లాయర్ కరుణాకర్ రెడ్డి సమకూర్చిన నిత్యవసర సరుకులను 30 మంది దివ్యాంగుల కుటుంబాలకు పంపిణీ చేశారు. తదనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.*
      *ఈకార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన అభ్యుదయ కవి, సంఘసేవకులు నక్కలపల్లె కొండారెడ్డి మాట్లాడుతూ, సింహాద్రిపురం మండలం ముసల్ రెడ్డిపల్లెకు చెందిన సింగం వెంకటనారాయణరెడ్డి భూస్వామిగా, ఫైనాన్షియర్ గా మంచి పేరుప్రఖ్యాతలు పొందారని, నగరిగుట్ట ప్రాంతంలో ఎంతోమంది పేదలకు నామమాత్రపు ధరలకే ఇళ్ల స్థలాలు విక్రయించారని, మధ్యతరగతి వారికి, నిరుపేదలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించే వారని, మానవతామూర్తిగా, సేవాతత్పరుడిగా ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో చేపట్టారని, ఆయన జ్ఞాపకార్థం సింగం కుటుంబసభ్యులు దివ్యాంగులకు చేయూతనివ్వడం అభినందనీయమని ప్రశంసించారు.*
     *ఈకార్యక్రమంలో  వికలాంగుల నెట్ వర్క్ రాష్ట్రఅధ్యక్షులు డా. ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, సంఘసేవకులు వంగల వెంకట కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు మహమ్మద్ రఫీ, ఖదీర్  తదితరులు పాల్గొన్నారు.*