దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి
మాగనూర్, సూర్య న్యూస్
మండలంలోని కోల్పూర్ గ్రామ సర్పంచ్, ముద్దు రాములు ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో కోల్పూర్ గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.
మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు శేషగిరి
సర్పంచ్ ముద్దు రాములు పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
కోల్పూర్ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గ్రామ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆయన నిరంతరం శ్రమించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ, ప్రజలతో మమేకమైన నాయకుడిగా పేరుపొందారు. మండలంలోని సర్పంచ్‌లందరినీ ఏకతాటిపైకి తెచ్చి, మాగనూర్ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన విశేష సేవలందించారని స్థానికులు, తోటి ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మంచి పేరుగాంచిన ముద్దు రాములు మృతి గ్రామ ప్రజలకు, మండల రాజకీయాలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.