స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, పరిశీలకురాలు అనురాధ, ఎమ్మెల్యే కామినేని , ఎమ్మెల్సీ జయమంగళ, త్రిమూర్తులు
కైకలూరు, మేజర్ న్యూస్, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్త్రుతస్థా సమావేశంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ ఎన్నికల పరిశీలకురాలు, ఎం ఎల్ సి. పంచుమర్తి అనురాధ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కైకలూరు నియోజకవర్గ పరిశీలకులు,రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా వక్తలు మట్లాడుతూ అందరూ ఒక కుటుంబంలా పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని అన్నారు. కూటమి తరపున ఎవరు పోటీ చేసినా వారి గెలుపు కోసం మనందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, నియోజకవర్గ టిడిపి కన్వినర్ కొత్తా నాగేంద్ర కుమార్, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, రాష్ట్ర పర్యటక శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ కొడాలి వినోద్, రాష్ట్ర కార్మిక కార్పొరేషన్ డైరెక్టర్ నల్లగోపుల చలపతి ,రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఆండ్రాజు శ్రీనివాసరావు, గజ్జెల గణేష్, పీజే మాల్యాద్రి , పెన్మేత్స త్రినాథరాజు, కురేళ్ళ ఏడుకొండలు, వీరమల్లు నరసింహారావు ,నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు.