మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండలం కోట్రమంగళం గ్రామానికి చెందిన కేశవరెడ్డి తల్లి మునెమ్మ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కర్మక్రియల్లో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ కాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మునెమ్మ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించి ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మునెమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, సీపీ రాజశేఖర్ రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని మునెమ్మకు నివాళులర్పించారు.