గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
సూర్య పెద్దపల్లి ప్రతినిధి:గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిపై సమాచారం అందడంతో ఎస్‌ఐ నరేష్ సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద 80 గ్రాముల గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ నరేష్ వెల్లడించారు. పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.