విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల : బాపట్ల జిల్లా పరిధిలోకి విద్య, వైద్యం, పర్యటన, వ్యాపారం లేదా ఇతర పనుల నిమిత్తం వచ్చే విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటళ్లు, రిసార్ట్స్, గెస్ట్‌హౌస్‌లు, అద్దె ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆశ్రమాలు, విద్యాసంస్థలు మరియు ఇతర ప్రాంగణాల యాజమాన్యాలు లేదా బాధ్యులు తప్పనిసరిగా వారి బస వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను 24 గంటల్లోగా అప్‌లోడ్ చేసి, ఎఫ్.ఆర్.ఆర్.ఓ. / ఎఫ్.ఆర్.ఓ. కార్యాలయాలకు అందించాల్సి ఉంటుందని తెలిపారు.