జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి : : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తే అక్కసు అన్నట్టుగా ఆయన తీరు తయారైందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2019–24 మధ్య వైసీపీ ఐదేళ్ల పాలనపై ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వానికి రైతు సంక్షేమంపై జగన్ పాఠాలు చెప్పడం “దెయ్యాలు వేదాలు వల్లించినట్టు” ఉందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో కూర్చొని రాజకీయ విమర్శలు చేయడం కంటే, రైతుల కష్టాలు, వారి సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.