BREAKING
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు

మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌!

Select Suryaa Now
మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌!

మలేరియా మాత్రల ఘటనపై
సుప్రీంకోర్టు సీరియస్‌!
-చిన్నారి మృతి ఘటనపై సీజేఐ ధర్మాసనం సుమోటో విచారణ
-దర్యాప్తును ఏపీ హైకోర్టు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశం
-మాత్రలు వేసుకున్న మరో 52 మంది సురక్షితం
- ఏపీ ప్రభుత్వం స్పష్టత


ఏపీ స్టేట్‌ బ్యూరో, అమరావతి:
పోలవరం ఏజెన్సీలో యాంటీ మలేరియా మాత్రలు వికటించిన ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గత నెల 1న ఏడేళ్ల చిన్నారి మడివి జమున మృతి చెందిన ఘటనను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా విచారించింది. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తును నిశితంగా పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది లూథ్రా కోర్టుకు హాజరై ఘటనకు సంబంధించిన వివరాలను, ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలను వివరించారు. ఘటనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని కోర్టుకు తెలిపారు.మాత్రలు వేసుకున్న మరో 52 మంది గిరిజనులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించామని, వారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని లూథ్రా ధర్మాసనానికి వివరించారు. పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలకు భిన్నంగా.. ఒక్క చిన్నారి మాత్రమే మృతి చెందిందని, మిగిలిన 52 మంది క్షేమంగా ఉన్నారని స్పష్టత ఇచ్చారు.ఘటనకు సంబంధించిన దర్యాప్తు ప్రక్రియను ఏపీ హైకోర్టు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, దర్యాప్తు పురోగతి వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి.