మద్దయ్య యాదవ్ ను సన్మానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె : బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన జి మద్దయ్య యాదవ్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నంద్యాల జిల్లాకు మొదటిసారిగా బనగానపల్లెకు చెందిన జి.మద్దయ్య యాదవ్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు.