సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్త బాధాకరం: జూ. ఎన్టీఆర్
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పై హీరో జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో బాధాకలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి లాంటి గొప్ప చిత్రాలు తీశారని గుర్తుచేశారు. కాలానికి ముందే ఆలోచించి సినిమాలు తీశారని ప్రస్తావించారు. తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడని కొనియాడారు. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.