శ్రీనారాయణస్వామి దేవస్థానంలో విశేషపూజలు
సిఎస్ పురం,మేజర్ న్యూస్ : ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానం నందు ఆదివారం విశేషపూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం ప్రత్యేకంగా అలంకరణ చేసిన పీఠంపై స్వామివారి అభిషేక విగ్రహం నెలకొల్పి అనంతరం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీగిరిరాజ నరసింహబాబు,ధర్మకర్త కె.చినఆదినారాయణ అధ్వర్యంలో దేవస్థానం ప్రధానఅర్చకులు పంచామృత అభిషేక పూజలు నిర్వహించి తదుపరి స్వామివారి మూలవిరాట్టు ఇతర దేవతామూర్తులను పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం దేవస్థానం ఆవరణలో గోమాతను పూజించి గోపూజ కార్యక్రమం తదుపరి స్వామివారికి మహానైవేద్యం సమర్పించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించి పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.పూజాకార్యక్రమాల్లో ఇఓ శ్రీగిరిరాజ నరసింహబాబు,భక్తులు,దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.