మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్
మార్కాపురం పట్టణంలోని స్థానిక కోర్టు సెంటర్ నందుగల ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్‌లో ఆదివారం విద్యార్థులకు కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి మార్కాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీ జె. కిషోర్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గౌరవ అతిథులుగా వి.ఆర్.ఓ (VRO)ల సంఘం నాయకులు శ్రీ సుబ్బారామిరెడ్డి గారు మరియు సిపిఐ రాష్ట్ర నాయకులు శ్రీ అందె నాసరయ్య గారు పాల్గొన్నారు.ఈ గ్రేడింగ్ టెస్ట్‌లో మొత్తం 70 మంది విద్యార్థులు పాల్గొనగా, ఉత్తీర్ణులైన విద్యార్థులకు ముఖ్య అతిథి జడ్జి శ్రీ జె. కిషోర్ కుమార్ గారు, సుబ్బారామిరెడ్డి గారు, అందె నాసరయ్య గార్ల చేతుల మీదుగా నూతన కలర్ బెల్టులు మరియు సర్టిఫికెట్లను అందజేశారు.