అనాధ వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ
అనాధ వృద్ధులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ
- మానవసేవయే మాధవసేవగా భావించాలి
- ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి
వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక రాజీవ్ నగర్ కాలనీలోని అమ్మ అనాధ వృధ్ధాశ్రమం వృధ్ధులకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి హజరై.. ఆయన చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాయచోటి ప్రాంతానికి చెందిన మాసగాని రామచంద్రయ్య, నారాయణమ్మ దంపతుల జ్ఞాపకార్థం కుమార్తెలు సునంద, మాధవి అనాధ వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు మానవత్వం తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేరంగుల వెంకట సుబ్బయ్య, అమ్మ అనాధ వృధ్ధాశ్రమాన్ని గత 30 ఏళ్ల నుంచి ఎలాంటి ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా కేవలం దాతల సహకారంతో వృధ్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం హర్షణీయం అన్నారు. ఇలాంటి వారిని సమాజం, ప్రభుత్వం ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సేవారత్న అవార్డుకు వెంకట సుబ్బయ్య అన్ని విధాల అర్హుడని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మానవసేవయే మాధవసేవగా భావించి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి అండగా నిలవడమే మానవ లక్ష్యంగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, వెంకటేష్, అమర్, ఉత్తన్న, నాగరాజు, మహీధర్, తేజ తదితరులు పాల్గొన్నారు.