BREAKING
సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వైద్య శిబిరం చీపురుపల్లిలో జనసేనలోకి చేరికలు ​భువనగిరిలో జిల్లాస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ఆరోగ్యకర సమాజమే లక్ష్యం న్యాయం చేయండి సార్, వరస చోరీలతో రైతు ఆవేదన. మోమిన్‌పేటలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ప్రారంభం ఈ నెల 5 నుండి  13 రోజుల పాటు సదరం క్యాంపులు ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఎన్నికల కమిషన్ విధానాలు శరవేగంగా సాగుతున్న యంగ్ ఇండియ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులు. రాయలసీమ ప్రజల కలలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ భూమి పూజకు ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి వైసిపి నాయకులు విమర్శలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం ఎద్దులను ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత

వరుణ దేవుని కోసం మహా యజ్ఞం -తాతయ్య గుంట గంగమ్మకు 108 బిందెల జలాభిషేకం

Select Suryaa Now
వరుణ దేవుని కోసం మహా యజ్ఞం  -తాతయ్య గుంట గంగమ్మకు 108 బిందెల జలాభిషేకం

రాష్ట్రం సస్యశ్యామలంగా, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు తాగు, సాగునీటికి ఇబ్బందులు రాకూడదని ఆకాంక్షిస్తూ వరుణ దేవునికి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ తెలిపారు. దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఈనెల ఆరో తేదీ మంగళవారం ఉదయం 6:54 గంటలకు 14 మంది వేద పండితులతో వరుణ హోమం, జపం నిర్వహిస్తారన్నారు. ఉదయం 10:30 గంటలకు అమ్మవారికి 108 బిందెలతో మహా జలాభిషేకం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో వర్షాల కోసం పూజలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, ఈవో ఏ.జయకుమార్ తెలిపారు. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వరుణ యాగంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి