BREAKING
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్త బాధాకరం: జూ. ఎన్టీఆర్‌ మద్దయ్య యాదవ్ ను సన్మానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు శ్రీనారాయణస్వామి దేవస్థానంలో విశేషపూజలు వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్

కార్పొరేషన్ లో గెలుపే లక్ష్యం కావాలి -తిరుపతిలో బిజెపికి పట్టు బిగించే వ్యూహం నార్త్ మండలంలో బలప్రదర్శన - ఎన్డీఏ కూటమి ఐక్యతతో ముందుకు

Select Suryaa Now
కార్పొరేషన్ లో గెలుపే లక్ష్యం కావాలి -తిరుపతిలో బిజెపికి పట్టు బిగించే వ్యూహం  నార్త్ మండలంలో బలప్రదర్శన - ఎన్డీఏ కూటమి ఐక్యతతో ముందుకు

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ రాజకీయంగా దూకుడు పెంచింది. నార్త్ మండలాన్ని కీలకంగా మార్చుకుని, సంస్థాగతంగా బలోపేతం కావాలని వ్యూహం రచిస్తోంది. ఆదివారం శాంతి నగర్‌లో జరిగిన నార్త్ మండల సమావేశంలో బిజెపి నేతలు ఈ రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, సీనియర్లు రాటకొండ విశ్వనాథ్, పి.లక్షణ్, యువమోర్చా నేతలు పృథ్వీరెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు.మండల అధ్యక్షులు పగడాల ప్రభాకర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ముఖ్య అతిథిగా హాజరైన వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

మండల ఇన్‌చార్జ్ పోనగంటి భాస్కర్ 

రిజర్వేషన్లు ప్రకటించగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, బలమైన అభ్యర్థులను గుర్తించాలి. ఒంటరిగా కాదు, ఎన్డీఏ కూటమి బలంతో, సమన్వయంతో పోటీ చేసి ప్రతి డివిజన్‌లో బీజేపీ జెండా ఎగరవేయాలి. పార్టీ విస్తరణ కోసం అందరం కలిసి పనిచేయాలి" అని పోనగంటి భాస్కర్ స్పష్టం చేశారు.రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఐక్యతే తిరుపతి కార్పొరేషన్‌లో విజయాన్ని నిర్ణయిస్తుందని, అందుకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నార్త్ మండలం బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి