BREAKING
విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు అనాధ వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ

వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత

Select Suryaa Now
వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత


- గుర్తింపు కార్డులు కలిగిన వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా
- వైకాపా సమన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ ఎస్.నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు.పార్టీ గుర్తింపు కార్డు కలిగిన కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ,ఉడుంవారిపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.నిసార్ అహ్మద్ కార్యకర్తలకు స్వయంగా గుర్తింపు కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ పార్టీ జెండాను నిత్యం భుజాన మోస్తూ,ప్రజల మధ్య ఉంటూ,కష్టకాలంలోనూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి ప్రధాన బలమన్నారు.కార్యకర్తల సేవలను కేవలం రాజకీయ కార్యకలాపాలకే పరిమితం చేయకుండా వారి సంక్షేమం,భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉందని పేర్కొన్నారు.గుర్తింపు కార్డు అనేది కేవలం ఒక కార్డు కాదు,పార్టీతో కార్యకర్తకు ఉన్న అనుబంధానికి గుర్తింపు.ఈ కార్డు కలిగిన కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉండటం కార్యకర్తల సంక్షేమంపై పార్టీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనమని నిసార్ అహ్మద్ అన్నారు.మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని,గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావడంతోపాటు,ప్రజల పక్షాన నిరంతరం గొంతు వినిపించాలని,కార్యకర్తల మధ్య సమన్వయం,ఐక్యత,క్రమశిక్షణ మరింత పెరగాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయ ధుందుబి మ్రోగించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు పార్టీ పరిశీలకుడు జింకా వెంకట చలపతి పార్టీ మండల కన్వీనర్ కరుణాకర్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షుడు నారాయణ స్వామి,మాజీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు,రాఘవేంద్ర,రాజారెడ్డి,కె.ఆనంద రెడ్డి,అమరనాథరెడ్డి,శంకరనాయక్,కేశవరెడ్డి,వెంకటరమణ,బాలాజీ నాయక్,గజేంద్ర రెడ్డి,విశ్వనాథ రెడ్డి,మోహన్ నాయక్,బాబా ఫక్రుద్దీన్,శ్రీరాములు రెడ్డి,వై.శంకర,సి.వి రమణ,రోహిత్,ఈ.రెడ్డెప్ప,శివయ్య,సలీం,వెంకటరెడ్డి,గంగరాజు,ఎన్.ఆనంద రెడ్డి,నూర్,రజనీకాంత్ నాయక్,బయ్యారెడ్డి,చిప్పిలి మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.