BREAKING
2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నాలుగు కోట్లతో తార్ రోడ్డు పనులకు శంకుస్థాపన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వైద్య శిబిరం చీపురుపల్లిలో జనసేనలోకి చేరికలు ​భువనగిరిలో జిల్లాస్థాయి నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ఆరోగ్యకర సమాజమే లక్ష్యం న్యాయం చేయండి సార్, వరస చోరీలతో రైతు ఆవేదన. మోమిన్‌పేటలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ ప్రారంభం ఈ నెల 5 నుండి  13 రోజుల పాటు సదరం క్యాంపులు ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఎన్నికల కమిషన్ విధానాలు శరవేగంగా సాగుతున్న యంగ్ ఇండియ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులు. రాయలసీమ ప్రజల కలలను సాకారం చేసిన సీఎం చంద్రబాబు మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ భూమి పూజకు ఆల్ పార్టీ కేటుగాడు ఆదినారాయణ రెడ్డి వైసిపి నాయకులు విమర్శలు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది -ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి,బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం

ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం..

Select Suryaa Now
ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు   సృజన పాఠశాలలో ఘన సత్కారం..

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా అనంతపురం జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాడిపత్రి బాబయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం అభ్యుదయ నగర్‌లోని సృజన పాఠశాలలో వారిని ఘనంగా సన్మానించారు.
నూతన బాధ్యతలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, ప్రైవేట్ పాఠశాలల సమస్యలను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, కోశాధికారి రామచంద్ర, ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, నగర అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, గౌరవ సలహాదారులు రామాంజనేయులు, మద్దయ్య, నగర ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ పాల్గొన్నారు.
తాడిపత్రి డివిజన్‌కు చెందిన బాబయ్య, చంద్రశేఖర్ రెడ్డి, దివాకర్, వెంకటరమణ, సుబ్బరాయుడు, భాస్కర్ యాదవ్, చెన్నారెడ్డి, నాగేంద్రరెడ్డి, రవిశంకర్, రంగయ్య, కంబగిరి, ప్రతాప్ రెడ్డి, బాబు, జిలానీ భాష, నజీర్, రామలక్ష్మిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.