5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం
బాపట్ల : బాపట్ల: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్‌లో నిర్మించిన ఆధునిక భవన సముదాయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు 5న ప్రారంభించనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వినూత్నంగా చేపట్టిన “ఇన్నోవేటివ్ ఫార్మర్స్ నెట్‌వర్క్” కార్యక్రమాన్ని కూడా బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ప్రారంభించనున్నారు.ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా సదుపాయాలు, శిక్షణా వసతులతో ఈ కేంద్రం రైతులు, విద్యార్థులు, పరిశోధకులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సేవలందిస్తోంది.