పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం
అనంతపురం బ్యూరో : అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కుర్లగుండ సిద్ధప్ప పక్షవాతం (పెరాలసిస్) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.
ఎమ్మెల్యే అందించిన నగదును మండల టీడీపీ అధ్యక్షుడు గోళ్ల వెంకటేశులు, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లిపల్లి నారాయణ తదితరులు గ్రామ టీడీపీ నాయకుల సమక్షంలో బాధితుడు సిద్ధప్పకు అందజేశారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తకు ఆర్థిక సాయం అందించడం పట్ల స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.