BREAKING
విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు అనాధ వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ

రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

Select Suryaa Now
రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం  విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

అనంతపురం బ్యూరో : ఎన్నో ఏళ్లుగా గుంతలమయమై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక చొరవతో రూ.3.14 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం వెళ్లే ప్రధాన రహదారి మీదుగా మల్లికార్జునపల్లి, విట్లంపల్లి, హులికల్లు గ్రామాలకు వెళ్లే మార్గంలో ఈ రహదారిని నిర్మించారు. గతంలో రహదారి గుంతలమయంగా ఉండటంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు కావడంతో రహదారి నిర్మాణం పూర్తయింది.

ప్రారంభోత్సవం సందర్భంగా విట్లంపల్లి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు గ్రామస్థులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవ కేక్‌ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామస్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రహదారి నిర్మాణం పూర్తవడంతో ఆయా గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.