కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా
చాపాడు మేజర్ న్యూస్
చాపాడు సమీపంలో కుందూ నది వద్ద పశుగ్రాసం ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేయబోయే బొగ్గుతో వెళుతున్న లారీ రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రొద్దుటూరు వైపు వెళుతున్న లారీ పశు గ్రాసం ట్రాక్టర్ను ఢీకొంది. రెండూ ఒకేసారి ఎడమవైపు రోడ్డు పక్క గుంతలో పడిపోయాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ బయటపడగా.. ట్రాక్టర్ డ్రైవర్ ప్రభు కుమార్ అందులో ఇరుక్కుపోయాడు.