BREAKING
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి* ఐదు ప్రాచీన భాషల అధ్యయనం కోసం నూతన ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులుకు ఘన సన్మానం రాజస్థాన్‌లో అరుదైన పక్షుల సంరక్షణలో చారిత్రక మైలురాయి ఆసియా-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు ముగింపు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సంకల్పానికి ఆకర్షితులై జనసేనలో చేరిన 10 కుటుంబాల మహిళలు భారత్‌లో తొలిసారిగా 5.56 కిలోమీటర్ల ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగం విజయవంతం ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే! సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి స్వచ్ఛతలో గిద్దలూరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు

శనివారం ఒకే రోజు మూడు విషాదాలు

Select Suryaa Now
శనివారం ఒకే రోజు మూడు విషాదాలు

అనంతగిరి ఘాట్‌లో బస్సు బోల్తా.. నలుగురు మృతి

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు పిల్లల దుర్మరణం

అదృశ్యమైన వివాహిత హత్య.. ప్రియుడే హంతకుడు

తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జిల్లా వాసులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్ 4):
వికారాబాద్ జిల్లాలో శనివారం ఒకే రోజు చోటుచేసుకున్న మూడు విషాద ఘటనలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు అనంతగిరి ఘాట్‌ రోడ్డులో బోల్తా పడి నలుగురు మృతి చెందగా.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో మృతి చెందిన ఘటన మరోవైపు కలచివేసింది. అదృశ్యమైన వివాహిత హత్యకు గురైన ఘటనను పోలీసులు ఛేదించి, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తినే నిందితుడిగా గుర్తించడం సంచలనం రేపింది.

ఘాట్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు శనివారం అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా, పలువురు గాయపడ్డారు. బస్సులో సుమారు 40 మంది ఉన్నారు.సంగారెడ్డి జిల్లా ఓడీఎఫ్‌ క్యాసారం ప్రాంతానికి చెందిన వారు ధారూర్‌ మండలం చింతకుంటకు చెందిన కొత్తగడి నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బస్సులో బయలుదేరారు. అనంతగిరి ఘాట్‌లోని ప్రమాదకర మలుపు వద్ద బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు డీఎస్పీ అంజయ్య తెలిపారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ స్నేహ మెహ్రా, కలెక్టర్‌ దీపక్‌ తివారీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

తల్లి.. ఇద్దరు పిల్లల విషాదాంతం

చెన్గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సోమనుగుర్తి గ్రామ శివారులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.ఉప్పరి మమత అలియాస్‌ పద్మమ్మ (30), ఆమె పిల్లలు సాకేత్‌ (8), జనశ్రీ (4) మృతి చెందారు. అక్టోబర్‌ 2న పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిన మమత తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. బావి వద్ద పిల్లల చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్‌ కనిపించడంతో అనుమానంతో గాలించగా ముగ్గురి మృతదేహాలు లభించాయి.
మమత, ఆమె భర్త మధ్య గతంలో కుటుంబ విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. గతంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఘటనకు అసలు కారణం ఏమిటన్నది పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన వివాహిత హత్య

కుల్కచర్ల మండలం చెల్లాపూర్‌కు చెందిన అమృత (34) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమెతో సంబంధం ఉన్న మంగలి ఆనంద్‌ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.బంగారం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో అమృతను చీర కొంగుతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో ఆనంద్‌ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసేందుకు ప్రయత్నించి, గోనె సంచుల్లో పెట్టి కృష్ణా నది ప్రాంతంలో పడేసినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని విచారించడంతో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

ఒకే రోజు.. మూడు విషాదాలు

అనంతగిరి ఘాట్‌లో ఘోర బస్సు ప్రమాదం..
సోమనుగుర్తిలో తల్లి, ఇద్దరు పిల్లల దుర్మరణం..
చెల్లాపూర్‌ వివాహిత హత్య..

శనివారం చోటుచేసుకున్న ఈ మూడు ఘటనలు వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఒకే రోజు వరుసగా జరిగిన ఈ ఘటనలు ప్రజలను కలచివేశాయి. ప్రమాదం, కుటుంబ కలహాలు, హత్య.. మూడు ఘటనలూ వేర్వేరు కారణాలతో జరిగినప్పటికీ పలువురు ప్రాణాలు కోల్పోవడం జిల్లావాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.