BREAKING
దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేములవాడ భీమేశ్వరాలయం ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి మోల్బియో డయాగ్నస్టిక్స్ షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ ‘బై’ రేటింగ్: రూ. 1,800 టార్గెట్ ప్రైస్ సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్ బుడగజంగాలకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లకు నిర్మల్ బాంగ్ ‘బై’ రేటింగ్: 40 శాతం అప్‌సైడ్‌తో రూ. 1,340 టార్గెట్ ప్రైస్ కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్. హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు. ముంబై రియల్ ఎస్టేట్ రికార్డు జోరు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట నిరసన బ్యాంక్ అధికారినంటూ మోసం నిందితుడి అరెస్ట్ లైబ్రరీ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు

చేతికొచ్చిన వరి పంట ఎండిపోతున్న పట్టించుకోరా….?

Select Suryaa Now
చేతికొచ్చిన వరి పంట ఎండిపోతున్న పట్టించుకోరా….?

ఉద్దె మర్రి సబ్‌స్టేషన్ వద్ద రైతుల నిరసన

శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి గ్రామంలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. త్రీఫేజ్ విద్యుత్ కోసం సబ్‌స్టేషన్ వద్దకు చేరుకున్న రైతులు, నిర్దేశిత సమయాల్లో విద్యుత్ సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.చేతికొచ్చిన దశలో ఉన్న వరి పంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. పంటను కాపాడుకునేందుకు విద్యుత్ కోసం ఎదురుచూస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.త్రీఫేజ్ విద్యుత్‌ను నిర్దేశిత సమయాల్లో నిరంతరాయంగా సరఫరా చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.