BREAKING
అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్.

Select Suryaa Now
ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్.

 

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-

 

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో భారీగా ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కుందుర్పి మండల కమిటీ ఆధ్వర్యంలో కుందుర్పి కెనరా బ్యాంకు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13.54 కోట్ల ఓట్లు తొలగించారని వారు ఆరోపించారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులు, ఆదివాసీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు జరిగాయని విమర్శించారు. బీజేపీ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాలను పరిశీలించి తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఉన్న స్వతంత్ర అధికారాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం ఈవీఎంల ధ్వంసం జరిగిందని, అక్కడ సుమారు 90 లక్షల ఓట్లను తొలగించారని నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని, ఓట్ల తొలగింపునకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా వామపక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఓటు హక్కు పరిరక్షణ కోసం నిరసనలు చేపడుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కుందుర్పి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి తక్షణమే రైతులు, కూలీలకు సహాయక చర్యలు అందించాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం, పశువులకు మేత, తాగునీరు, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ శివలింగప్ప, రవి, శామ్యూల్, ప్రవీణ్, జి. మారుతి, మలయనూరు ఈరన్న, లక్ష్మీపతి, తిమ్మప్ప, మంజునాథ్, హనుమంతరాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.