BREAKING
పేదల ఇళ్ల మంజూరు హర్షినియం.. నిలిచిపోయిన ఇళ్ల మాటేమిటి సింగీతం శ్రీనివాసరావు మరణం తీరని లోటు.. వైజయంతీ పతాకంపై ఆయన పేరు శాశ్వతం: నిర్మాత అశ్వినీదత్ భావోద్వేగం రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌కు తాడువాయి విద్యార్థులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్.. త్వరలోనే నంది అవార్డుల ప్రదానోత్సవం! అహోబిలంలో మాజీ ఎంపీ గంగుల పూజలు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నడిపెల్లి విజిత్ కుమార్ సహజ రంగులతో జీవనోపాధికి కొత్త అవకాశాలు చత్రపతి శివాజీ ప్రభుత్వ కళాశాలలో జాతీయ సదస్సు గన్నవరం నారాయణ పాఠశాలలో విద్యార్థి-నాయకత్వ సదస్సు. పూజిత పొన్నాడ పుట్టినరోజు వేళ స్పెషల్ పోస్టర్ విడుదల.. విలేజ్ హారర్ చిత్రంలో నర్తకిగా నటిస్తున్న టాలెంటెడ్ నటి! అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు రంగుల ప్రతాపరెడ్డి 120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్ కు వినతి గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం

అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

Select Suryaa Now
అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కు ఆహ్వానం…

 ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అంబాభవాని మాత దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిట సభ్యులు  గ్రామ పెద్దలు, నిర్వాహకులు గురువారం ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, జర్నలిస్టులను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. షాద్ నగర్ , ఎమ్మెల్యే , రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్‌కు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మాజీ జడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డిలకు గ్రామ పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు అందజేసి శరన్నవరాత్రోత్సవాలకు ఆహ్వానించారు. అలాగే షాద్‌నగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు ఎం.డి. ఖాజాపాషా (కేపీ), రాఘవేందర్ గౌడ్, సాయినాథ్‌రెడ్డిలను కూడా ఉత్సవాలకు ఆహ్వానించారు. అంబా భవాని మాత శరన్నవరాత్రోత్సవాల నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. ఖాజాపాషా (కేపీ) రూ.5,100 నగదు విరాళంగా అందజేశారు. అమ్మవారి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

 భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు…

 ఆలయ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సర్పంచ్ నవ కిరణ్ నరసింహ….

ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 4.30 గంటలకు అభిషేకం, ఉదయం 8 గంటలకు పల్లకి సేవ, 9 గంటలకు మహానైవేద్యం, 10.30 గంటలకు సప్తశతి చండీ హోమం, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నటు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సర్పంచ్ నవ కిరణ్ నరసింహ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు బతుకమ్మ కార్యక్రమం, 6.30 గంటలకు లలితా సహస్రనామ అర్చనలు, రాత్రి 7 గంటలకు మంగళహారతి, 8 గంటలకు భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారిని వివిధ ప్రత్యేక అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11న స్వర్ణ కవచాలంకృత దేవి, 12న బాలత్రిపుర సుందరి దేవి, 13న గాయత్రీ దేవి, 14న అన్నపూర్ణా దేవి, 15న లలితా త్రిపుర సుందరి దేవి, 16న సరస్వతి దేవి, 17న మహాలక్ష్మి దేవి, 18న దుర్గా దేవి, 19న మహిషాసురమర్ధిని దేవి, 20న రాజరాజేశ్వరి దేవి అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు లేపాక్షి పూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అంబాభవాని మాతను దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ చైర్మన్, కార్యవర్గ సభ్యులు కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ నవ కిరణ్ నరసింహ, ఉప సర్పంచ్ అభినవ్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కావలి శ్రీశైలం, మాజీ చైర్మన్ గుల్లే కృష్ణయ్య, శ్రీ అంబా భవాని మాత దేవాలయం కమిటీ చైర్మన్ చంద్రయ్య, డైరెక్టర్లు నారం రామ్ రెడ్డి, బాల్రత్నం గౌడ్, ముత్యాల రాములు, జంగం రవి, కుక్కల మహేష్,  వార్డు సభ్యులు గడ్డమీది శ్రీను, గోనెల రాము, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ల యాదయ్య యాదవ్ బద్దుల లక్ష్మయ్య యాదవ్, ఎండి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.. 

M. నరసింహ రెడ్డి, మేజర్ న్యూస్, ఫరూక్ నగర్….