పేదల ఇళ్ల మంజూరు హర్షినియం.. నిలిచిపోయిన ఇళ్ల మాటేమిటి
పేదలకు ఇళ్ల మంజూరు హర్షణీయం..నిలిచిపోయిన ఇళ్ల మాటేమిటి!
వేంపల్లె మేజర్ న్యూస్:
పేదలకు కొత్తగా 3 లక్షల ఇళ్ల మంజూరు హర్షణీయం అని, అయితే గతంలో మంజురై మధ్యలోనే వివిధ దశల్లో నిలిచిపోయిన లక్షలాది పేదల ఇళ్ల మాటేమిటి అని ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందుల మెగా ఇళ్ల కాలనీలోనే 6950 ఇళ్లులు ఆరేళ్ల క్రితం పేదలకు మంజురైన, ఇప్పటికీ కేవలం 15 ఇళ్లల్లో మాత్రమే లబ్ధిదారులు చేరారన్నారు. పులివెందులలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న ఆర్థిక సహాయం ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణంతో పాటు అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లును కూడా నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
గండికోట షేక్ ఖదీర్.. వేంపల్లె.