ప్రజా ఉద్యమకారుడు నాగభూషణం వర్ధంతి సభ
నరసాపురం, మేజర్ న్యూస్ :సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ఉద్యమకారుడు తాడి నాగభూషణం మరణం తీరనిలోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు అన్నారు. స్థానిక 22వ వార్డు పాలపర్తి వారి పేటలో కామ్రేడ్ నాగభూషణం సంస్కరణ సభ సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు అధ్యక్షతన సోమవారంజరిగింది. ముందుగా నాగభూషణం చిత్రపటానికి సిపిఎం పార్టీ బృందం కుటుంబ సభ్యులు పూలమాలేసి జోహార్లు అర్పించారు.అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ తాడి నాగభూషణం కుటుంబం ముందు నుంచే కమ్యూనిస్టు కుటుంబమని నాగభూషణం విద్యార్థి యువకుడిగా ఉన్నప్పుడు సమాజంలో జరుగుతున్న వివక్షకు వెలువేతకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించారు అన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగులు కార్మికులు సమస్యలపై ట్రేడ్ యూనియన్లలొ పనిచేయడం జరిగిందన్నారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సామాజిక ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించారు అన్నారు. కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ద్వారా అనేక సామాజిక ఉద్యమాలలో పని చేశారన్నారు. నరసాపురం పట్టణంలో అంబేద్కర్ విగ్రహము. అంబేద్కర్ భవనము నిర్మాణంలో నాగభూషణం ముఖ్యపాత్ర పోషించారని గుర్తు చేశారు. నాగభూషణం భౌతికంగా మరణించిన వారి యొక్క ఆశయాలు నిరంతరం గుర్తుంటాయి అన్నారు. నాగభూషణం మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని కొని ఆడారు . దొండపాటి స్వాములు, పొగాకు పూర్ణ,పొగాకు నారాయణరావు, తెలగం శెట్టి సత్యనారాయణ,పాలపర్తి లక్ష్మీనారాయణ,నల్లి తామస్,బల్ల రామ్మోహన్రావు,కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.
ఇజ్రాయిల్ నరసపూర్