BREAKING
వెటర్నరీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కీలక పాత్ర డీన్ డా.మాలకొండయ్య నేటి పంచాంగం27 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 27 నవంబర్, 2026 వగ్గంపల్లిలో కుమ్మిత భాగ్యలక్ష్మి విజయభేరి పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన

ఇందుగుపల్లిలో 725 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

Select Suryaa Now
ఇందుగుపల్లిలో 725 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

వత్సవాయి :-భూ హక్కులను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా వత్సవాయి మండలం ఇందుగుపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జగ్గయ్యపేట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పంపిణీ చేశారు. గ్రామానికి మంజూరైన పాస్ పుస్తకాల్లో 725 పుస్తకాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.ఇందుగుపల్లి గ్రామానికి మొత్తం 760 పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు కాగా, ఇప్పటికే 725 పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు అందజేశారు. తమ భూములకు సంబంధించిన అధికారిక పత్రాలు చేతికి అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. భూ రికార్డులు సక్రమంగా ఉండటం వల్ల భవిష్యత్తులో భూ లావాదేవీలు, రుణాలు తదితర అవసరాలకు పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ భూములకు సంబంధించిన హక్కులు, రికార్డులు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా రెవెన్యూ అధికారులు సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.భూమి ప్రతి కుటుంబానికి ఎంతో విలువైన ఆస్తి అని, దానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండటం అత్యంత ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భూ రికార్డుల విషయంలో ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను సమన్వయం చేసి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బందికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన 35 పాస్ పుస్తకాల ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల టీడీపీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, ఎంపీటీసీ చావా నాగేశ్వరరావు, సర్పంచ్ మొల కృష్ణారావు, హారి మల్లు, మొల వెంకట్రాములు, మొల శ్రీను, తేలు కుంట్ల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.