BREAKING
స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్ ఐక్యరాజ్యసమితి వేదికపై అరకు గళం.. దేవాదాయ శాఖ ఇఓగా చిట్టిబాబు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈసారూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే! భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’ సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి చెత్తను సద్వినియం చేసుకోవాలి దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ద్వితీయ శ్రేణి ద్రవ్యోల్బణ ముప్పు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. అమెరికాలో దుస్తుల తయారీ సంస్థలపై టెక్సాస్ అటార్నీ జనరల్ విచారణ రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 14 ఏళ్ల బాలిక అదృశ్యం కాల్బెమల్‌లో చోరీల కలకలం! ఒకే రాత్రి రెండు ఇళ్లకు కన్నం.. రూ.2.21 లక్షల సొత్తు అపహరణ

పరిశ్రమల స్థాపనలో వేగం పెంచాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
పరిశ్రమల స్థాపనలో వేగం పెంచాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

 

కర్నూలు, అక్టోబర్ 5: జిల్లాలో పరిశ్రమల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు..

సోమవారం కలెక్టరేట్ లో పరిశ్రమల స్థాపన పురోగతి పై కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలులో ఉన్న అన్ని రకాల భారీ పరిశ్రమలకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేసి, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్  ఏపిఐఐసి, పరిశ్రమల శాఖ, నెడ్ క్యాప్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని రకాల అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియాలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్‌లను త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఫౌండేషన్ స్టోన్ వేయడానికి సిద్ధంగా ఉన్న పరిశ్రమలను గుర్తించి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో ఏపిఐఐసి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, తదితరులు పాల్గొన్నారు..