BREAKING
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్

14 ఏళ్ల బాలిక అదృశ్యం

Select Suryaa Now
14 ఏళ్ల బాలిక అదృశ్యం

చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధర్మసాగర్‌లో 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ధర్మసాగర్‌లో అద్దెకు ఉంటున్న షాజహాన్‌ ఖాతూన్‌ కుటుంబం సోమవారం సాయంత్రం శంకర్‌పల్లికి మకాం మార్చింది. అయితే కొంత సామగ్రి ధర్మసాగర్‌లోని షట్టర్‌లోనే ఉండిపోవడంతో వాటిని చూసుకునేందుకు భర్త సోదరి సబ్రా ఖాతూన్‌ (14)ను అక్కడే ఉంచారు. మంగళవారం ఉదయం 9 గంటలకు షాజహాన్‌ తిరిగి వచ్చేసరికి సబ్రా కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

బాలిక గతంలో ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండేదని ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. దీంతో చేవెళ్ల పోలీసులు క్రైం నంబర్‌ 684/2026, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 137(2) కింద కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు.

బాలిక వివరాలు: సబ్రా ఖాతూన్‌, వయస్సు 14 సంవత్సరాలు, ఎత్తు సుమారు 4.2 అడుగులు, గోధుమ ఛాయ, హిందీ మాట్లాడగలదు. బాలికకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా చేవెళ్ల పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

 

(చేవెళ్ల - మేజర్ న్యూస్)