BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి..

Select Suryaa Now
  సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి..

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి..కరువు జిల్లాగా ప్రకటించాలి 

 జిల్లా సాగునీటి పనులు సాధన సమితి డిమాండ్ 

 ఎమ్మిగనూరు మేజర్ న్యూస్ ప్రతినిధి

 కర్నూలు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంటే పాలకులకు పట్టడం లేదంటూ తక్షణమే కరువు జిల్లాను ప్రకటించడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాగునీటి సమితి అధ్యక్షులు శేషారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్డీఎస్ కుడికాలువ పనులు కర్నూలు జిల్లా కరువు తరిమికొట్టాలన్నారు. వేదావతి ప్రాజెక్టుకు 53 కోట్లు నిధులు కేటాయించినప్పటికీ పనులు వేగవంతం చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. జి ఆర్ పి ప్రాజెక్టు పంప్ హౌస్లలో  11 మోటర్లలో కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నాయని అన్ని మోటార్లను మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎల్ నీనో ప్రభావంతో దేశమంతా వర్షాలకు కురవకుంటే కర్నూలు జిల్లాలో కేవలం 15 మండలాలను కరువు మండలాలకు ప్రకటించి మిగిలిన మండలాలకు విస్మరించడం పై వారు మండిపడ్డారు. కరువు అన్ని చోట్ల ఉంది కావున పంటల బీమా అంది ఎందుకు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగానికి సాగునీటి వనరులు కల్పించి కర్నూల్ జిల్లాలో కరువు రక్షణ పారద్రోలాలు అన్నారు. ఈ కార్యక్రమంలో కె ఆర్ నటరాజ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.