BREAKING
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్

చెత్తను సద్వినియం చేసుకోవాలి

Select Suryaa Now
చెత్తను సద్వినియం చేసుకోవాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

గోపాలపురం గ్రామ శివారులోని భీమోలు రోడ్డులో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో పారిశుధ్య నిర్వహణపై ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించారు. ఎంపీడీవో ఆర్. సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. చెత్త సేకరణ నుంచి సంపద తయారీ కేంద్రాల్లో దాని శాస్త్రీయ నిర్వహణ వరకు చేపట్టాల్సిన విధానాలను వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఆర్. సుజాత మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను బిన్ బ్యాగ్ విధానంలో సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలన్నారు. అక్కడ సుమారు 45 రోజులపాటు శాస్త్రీయ పద్ధతిలో మగ్గించడం ద్వారా నాణ్యమైన వర్మీ కంపోస్టు తయారు చేయవచ్చని తెలిపారు. తయారైన వర్మీ కంపోస్టును సొసైటీల ద్వారా రైతులకు విక్రయించే విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

పొడి చెత్తను తడి చెత్తతో కలపకుండా స్వచ్ఛ రథాల ద్వారా ఇంటింటికీ సేకరించాలని సూచించారు. ప్లాస్టిక్, కాగితం, ఇనుము తదితర పునర్వినియోగ పదార్థాలను విడదీసి సక్రమంగా నిర్వహించాలన్నారు. చెత్తను మూలస్థాయిలోనే వేరు చేసి సేకరించడం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీవో సుజాత సూచించారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.