BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Select Suryaa Now
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే  పరిష్కరించాలి

 

*జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*

*కలెక్టరేట్  సమావేశ  మందిరంలో సోమవారం  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అనురాగ్ జయంతి స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ భాస్కర్ రావు,రెవెన్యూ  అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి  వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 131 అర్జీలను స్వీకరించారు.  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు  పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. 
అందులో రెవిన్యూ శాఖ 73,  సర్వే ల్యాండ్స్ 12, మున్సిపాలిటీ 10, వ్యవసాయ 6, జిల్లా పరిషత్ 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 4, విద్య శాఖ 3, గ్రామీణ అభివృద్ధి 2, పంచాయతీరాజ్ 2, ఉపాధి కల్పన 2, అటవీ 2, పంచాయతీ 2, మైన్స్, వైద్య ఆరోగ్య, పౌరసరఫరాల, ఇరిగేషన్, లేబర్, సమాచార శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, బీసీ వెల్ఫేర్, శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికపుడు డిస్పోస్ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో  డిప్యూటీ కలెక్టర్లు  కృతిక, సాత్విక్, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీల, జెడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణా అభివృద్ధి  అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ అలివేలు ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు*