రైతు పొలాలకు రహదారి సౌకర్యం --8 పుంత రోడ్లకు రూ.2.19 కోట్లు --ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకు,మేజర్ న్యూస్ : రైతుల పొలాలకు రాకపోకలను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తణుకు నియోజకవర్గంలో పుంత రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. మూడు మండలాల్లో ఎనిమిది పుంత రోడ్ల నిర్మాణానికి రూ.2.19 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.తణుకు మండలంలోని దువ్వ, కొమరవరం, వేల్పూరు గ్రామాల పరిధిలో నాలుగు, అత్తిలి మండలంలో రెండు, ఇరగవరం మండలంలో రెండు పుంత రోడ్లు అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో పొలాలకు వెళ్లేందుకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు పంట కోతల సమయంలో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ రోడ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని, పుంత రోడ్లతో రైతులకు క్షేత్రస్థాయిలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.
అనుకుమార్ తణుకు