ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే.
ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే.
వట్టిపల్లి ,. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు ,ఎంపీడీవో సాయి తరుణ్ ఆధ్వర్యంలో, ఉదయం 10:00 నుండి ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినారు. 12 మంది అధికారులు హాజరైనట్టు ,రెండు దరఖాస్తులు వచ్చినట్లు ,ఎంపీడీవో సాయి తరుణ్ తెలిపినారు .హుస్సేనగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రెవెన్యూ సమస్య దరఖాస్తు ఒకటి ,దేవనూరు గ్రామ పంచాయతీలో, గ్రామ సమైక్య భవన నిర్మాణం ,రోడ్డు నిర్మాణంగురించి ఒక దరఖాస్తు వచ్చినది. దేవనూరు సర్పంచ్ రామ్ చందర్, మాజీ ఎంపీటీసీ సిహెచ్ నర్సింలు ,సమైక్య భవనము గురించి ఎంపీడీవో తో చర్చించినారు. గ్రామానికి మంజూరైన భవనం ఎందుకు నిర్మించడం లేదని ,దేవనూరు బీటీ రోడ్డు బాగా పాడైపోయినదని ,పాఠశాల విద్యార్థులు ,బ్యాంకుకు వచ్చేవారు ,గ్రామ ప్రజలు నానా అవస్థలు పడవలసి వస్తుందని, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకొని సమైక్య భవనము ,రోడ్డు నిర్మాణము చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి తరుణ్ తో పాటు ప్రభుత్వ సిబ్బంది, రైతులు ,సర్పంచ్ రామచందర్, మాజీ ఎంపిటిసి నర్సింలు, కాశప్ప,, చంద్రశేఖర్ మొదలగువారు పాల్గొన్నారు.