BREAKING
రాయపాడులో విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి ప్రాంగణ నియామకాల్లో విశ్వం డిగ్రీ కళాశాల విజయదుందుభి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ నిర్భంద ఉత్తర్వులు ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిండ్ల దశరథం తొంబై శాతం సబ్సిడీ తో స్ప్రింక్లర్స్ పంపిణీ స్వర్ణ గిరిలో కలుశ పంచామృత అభిషేకం* వసతులు కరువైన బస్టాండ్ లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కొత్త చిత్రం.. దొంగ నా కొడుకు రిలీజ్ డేట్ లాక్! పిచ్చికుక్క సైర విహారం రెండేళ్ళ బాలుడితో సహా ఆరుగురికి గాయాలు క్లీన్ ప్రొద్దుటూరుకు కెమెరాల నిఘా అడుగులు శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన

ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు

Select Suryaa Now
ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు

నారాయణపేట, సూర్యన్యూస్ :

యువతలో సరైన అవగాహన కల్పించడం ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని ప్రోగ్రాం ఆఫీసర్ డా.సత్య ప్రకాష్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు, హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణ, ముందస్తు పరీక్షలు, చికిత్స, హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్షను నివారించేందుకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుంది, హెచ్‌ఐవీ నివారణ చర్యలు, హెచ్‌ఐవీ పరీక్షల ప్రాముఖ్యత, చికిత్స అందుబాటులో ఉండటం, సురక్షితమైన జీవన విధానం మరియు హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా సమాన గౌరవంతో వ్యవహరించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు.  బహుమతులు  అందజేశారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సుదర్శన్ రావు, వైద్య ఆరోగ్య సిబ్బంది, లెక్షరర్లు పాల్గొన్నారు.
– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.