BREAKING
ఘనంగా జన్మదినం జరుపుకున్న సర్పంచ్ సత్యనారాయణ యాదవ్ ఐరోపాలో ప్రమాదంలో ఆన్‌లైన్‌లో భద్రతా లోపాలు బయటపెట్టిన డచ్ పరిశోధకులు సీఐ ని కలిసిన జనసేన నాయకులు. జహీరాబాద్‌లో పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు! ఈవీఎం గోడౌన్‌ భద్రతపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పౌర సేవల్లో నాణ్యతకు ఉద్యోగుల సామర్థ్యమే కీలకం: సీఎం చంద్రబాబు అమెరికా ఫెడరల్ డైరెక్టర్‌పై సెనేటర్ ఎలిజబెత్ వారన్ తీవ్ర ఒత్తిడి లివర్ ఆరోగ్యం: మనం చేసే పొరపాట్ల వల్ల కాలేయం ఎలా దెబ్బతింటుందో తెలుసా? సంధ్యా వేళలో కనువిందు చేసిన సూర్యుడు విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఆహ్వానం శ్రీశైలంలో "హరివిలాసంపై" ప్రవచన కార్యక్రమం బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు కంటెస్టెంట్లు! దక్షిణ ఆఫ్రికా నుంచి స్వదేశానికి నైజీరియా పౌరుల తరలింపు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన: జవహర్ నవోదయలో ఘనంగా కళా-ఉత్సవ్

ప్రాంగణ నియామకాల్లో విశ్వం డిగ్రీ కళాశాల విజయదుందుభి

Select Suryaa Now
ప్రాంగణ నియామకాల్లో విశ్వం డిగ్రీ కళాశాల విజయదుందుభి


- ఉద్యోగాలకు 20 మంది విద్యార్థులు ఎంపిక 
మదనపల్లె : విశ్వం డిగ్రీ కళాశాలలో ఎస్ఎస్ఎన్ ఐటి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్,బెంగళూరు ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 20 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న బీకాం,బీబీఏ,బీసీఏ,బీఎస్సీ విద్యార్థులు కలిపి మొత్తం 234 మంది ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఎస్ఎన్ ఐటి  టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో చిన్నారెడ్డి,సంస్థ హెచ్‌ఆర్‌ బృంద సభ్యులు విద్యార్థులకు సంస్థలోని ఉద్యోగ అవకాశాలు,విధులు,కెరీర్‌ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు.విద్యార్థుల ప్రతిభ,నైపుణ్యాలను పరిశీలించి అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు.ఈ సందర్భం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్ సి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.అందుబాటులోకి వచ్చే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.కళాశాల చైర్మన్‌ మలిపెద్ది ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కళాశాల ఆధ్వర్యంలో నిరంతరం ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు తమ ప్రతిభను,నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.ఈ 
కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఆర్షద్‌,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించిన సీఈవో చిన్నారెడ్డి,హెచ్‌ఆర్‌ బృందానికి కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.ఎంపికైన విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.